![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి' (Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -443 లో.....కావ్య, రాజ్ లు బయటకు వెళ్తారు. అప్పుడే మిర్రర్ నుండి మాయని రౌడీలు వెంబడించడం కావ్య చూస్తుంది. వెంటనే రాజ్ ని కార్ ఆపమని చెప్పి మాయ గురించి చెప్తుంది. ఆ తర్వాత రాజ్ కార్ ఆపుతాడు. మాయ పరిగెడుతూ వచ్చి కావ్య వెనకాల దాక్కుంటుంది. రౌడీ లు రాజ్ ని చూసి పారిపోతారు. మాయ మళ్ళీ కోమాలోకి వెళ్తుందని చెంపపై గట్టిగా ఒక్కటిస్తుంది కావ్య. ఎందుకు కొట్టావని రాజ్ అడుగగా.. ఇలా కొట్టకపోతే తను మళ్ళీ కోమాలోకి వెళ్తుందని కావ్య చెప్తుంది.
ఆ తర్వాత మాయని కావ్య, రాజ్ లు ఇంటికి తీసుకొని వెళ్తారు. ఆ మాయ అబద్ధం.. ఈ మాయనే నిజమని కావ్య చెప్తుంది. ఈ నిజాన్ని మీ ముందు నిలబెట్టాలని నేను ఎంతో కష్టపడ్డాను. ఈ నిజం వెనకాల కూడా ఎన్నో మోసాలు ఉన్నాయి.. మామయ్య గారు కూడా మోసపోయారని కావ్య అనగానే అందరు షాక్ అవుతారు. ఇంట్లో అందరిని మాయ చేద్దామని ఈసారి ఈ మాయని తీసుకొని వచ్చావా.. ఆ నాటకం బయటపడిందని ఈ నాటకం మొదలు పెట్టాలనుకుంటున్నావా? ఈ మాయ నిజం అనడానికి సాక్ష్యం ఏంటని రుద్రాణి అడుగుతుంది. నేనే సాక్ష్యం ఈ మాయనే నిజమైన మాయ అని సుభాష్ అంటాడు. అంతా అబద్దం ఇప్పుడు వదిన కోపంగా ఉందని తనకి కోపం తగ్గించడానికి ఇలా ఒక మాయని తీసుకొని వచ్చారని రుద్రాణి అంటుంది. దాంతో ఇంట్లో అందరూ రుద్రాణిని తిడతారు. ఈ మాయ అబద్దపు మాయ అని నీకు తెలుసా అని రుద్రాణిని రాజ్ అడుగుతాడు. బిడ్డని వదిలేసి ఉన్నప్పుడే ఈ మాయ గురించి కావ్యకి డౌట్ వచ్చింది. ఇలా తను మాయని వెతుక్కుంటూ వెళ్తుంటే అక్కడ ఈ మాయకి బదులు మొన్న వచ్చిన మాయ ఉంది .. చివరికి కావ్య ఈ మాయని పట్టుకుంది అనుకోకుండా ఈ మాయ కోమాలోకి పోయింది.. అందుకే వేరే దారి లేక డాడ్ నిజం చెప్పాడని రాజ్ జరిగింది చెప్తాడు. ఇప్పుడు నువ్వు నిజం చెప్పమని మాయతో కావ్య అంటుంది. నన్ను క్షమించండి మీ పరువు తియ్యాలని ఎవరో నా వెనకాల ఉండి ఇదంతా చేశారు.. అసలు ఆ బిడ్డకి తల్లిని నేను కాదు.. తండ్రి సుభాష్ గారు కాదు.. అనాధ ఆశ్రమం నుండి తీసుకొని వచ్చారు. నెలకు ఒకసారి ఇలా బ్లాక్ మెయిల్ చేస్తే డబ్బులు ఇచ్చారు.. అలా చేయమని వాళ్ళే చెప్పారని మాయ చెప్తుంది.
ఆ తర్వాత ఇందులో తప్పు సుభాష్ గారిది ఏం లేదని మాయ అంటుంది. ఆ తర్వాత కుటుంబమంతా కలిసి మా జీవితాల్లోకి రావొద్దని మాయని పంపిస్తారు. ఆ బాబుని ఏం చేస్తారని రుద్రాణి అంటుంది. ఈ బాబుని నేనే పెంచుకుంటానని కావ్య అంటుంది. నాకు ఆ నిర్ణయం నచ్చిందని రాజ్ అంటాడు. తరువాయి భాగంలో కావ్య దగ్గరగా రాజ్ వస్తాడు. కావ్య తిట్టడానికి వస్తున్నాడనుకుని ఇక మొదలు పెట్టండని అంటుంది. కానీ రాజ్ ప్రేమగా వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |